ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో రోడ్డెక్కిన విద్యార్థులు.. స్తంభించిన ట్రాఫిక్

Students Protest in Guntakallu: గుంతకల్లులోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు 63వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

Guntakal
గుంతకల్లులో రోడ్డెక్కిన విద్యార్థులు

By

Published : Dec 22, 2022, 2:46 PM IST

Students Protest in Guntakallu: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని బాలుర బీసీ వసతి గృహం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆర్‌ఎస్‌యూ (RSU) విద్యార్థి సంఘం నాయకులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. భోజనం ఉన్న పాత్రలను రోడ్డుపై ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడి, విద్యార్థి సంఘాలకు సర్ది చెప్పారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. హాస్టల్ వార్డెన్ మాటలను నమ్మి ఈ ధర్నాను విరమిస్తున్నామని, ఇకపై బీసీ వసతి గృహం విద్యార్థులకు సరైన భోజనాన్ని వడ్డించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హాస్టల్ వార్డెన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details