అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన.. వసతి గృహాల విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సెలవు ప్రకటించి మెస్ మూసివేశారు. ఈ చర్యతో ఆగ్రహించిన విద్యార్థులు...కళాశాల ఉన్న సమయంలో మెస్ మూసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. కళాశాల కమిటీ నిబంధనల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని డిప్యూటీ వార్డెన్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనలు సద్దుమణిగించారు.
మెస్ మూసివేశారని విద్యార్థుల ఆందోళన - students protest due to closing of hostel mess at ananthapur
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ వసతి గృహానికి సెలవు ప్రకటించి మెస్ మూసివేయడంపై అభ్యంతరం చెప్పారు.
మెస్ మూసివేసారని అనంతపురంలో విద్యార్థుల ఆందోళన