అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. బడి ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మాణం ఆపాలని ప్లకార్డులు చేతపట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు.
'పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం వద్దు' - students protest at mpdo office news
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మించరాదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ కార్యకలాపాల కోసం వచ్చే ప్రజల రద్దీతో ప్రశాంత చదువుకు ఆటంకం కలుగుతుందని పిల్లల తల్లిదండ్రులు అన్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట విద్యార్థుల నిరసన
విద్యార్థులకు అదనంగా గదులు నిర్మించాల్సింది పోయి..పాఠశాల ప్రాంగణంలో సచివాలయం ఏర్పాటు చేయటమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వస్తూ..పోతూ ఉండే ప్రజల రద్దీతో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందన్నారు. జనసంచారం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు ఆపాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు