ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు - ఉరవకొండ మండలం

బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. వీరికి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. ఉరవకొండ మండలం పరిధిలోని ఉండబండ, హవలికి, పాల్తూరు, విడపనకల్ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఉరవకొండలోని డిపో ఎదుట ధర్నాకు దిగారు.

ధర్నాచేస్తున్న విద్యార్థులు

By

Published : Jul 9, 2019, 7:40 PM IST

గ్రామానికి వస్తున్న బస్సును నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆటోలో ప్రయాణించడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని తెలిపారు. గతంలో డిపో అధికారులను బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా... ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని సాకులు చెబుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సార్లు బస్సును పునరుద్ధరించాలని అర్జీలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడించారు. వార సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ధర్నాచేస్తున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details