ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధిక ధరలకు అమ్ముతున్నారు.. చర్యలు తీసుకోండి' - ఎస్ఎఫ్ఐ

నిబంధనలకు విరుద్ధంగా... అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారంటూ గుంతకల్లులోని ఓ కార్పొరేట్ కళాశాల ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకలు ఆందోళన చేపట్టారు. వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల ధర్నా'

By

Published : Jun 23, 2019, 10:51 AM IST

Updated : Jun 23, 2019, 1:32 PM IST

'అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల ధర్నా'

నిబంధనలకు విరుద్దంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ కార్పొరేట్ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కళాశాల తీరుపై అధికారులకు విద్యార్థి సంఘాల నాయకులు సమాచారమందించారు. గత వారంలో ఇలాంటి ఘటనలో ఓ పాఠశాలపై చర్యలు తీసుకున్నా... సదరు సంస్థ ఏ మాత్రం లెక్కచేయటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు యాజమాన్యాలతో సమావేశమై...నిబంధనలు అతిక్రమించవద్దని హెచ్చరించినా... పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహించారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Last Updated : Jun 23, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details