ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల వినూత్న నిరసన - పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసన

పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా గుత్తిలో ఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట.. గులాబీ పూలతో నిరసన చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. తహసీల్దార్​కు గులాబీ పూలతో పాటు వినతిపత్రాన్ని సమర్పించారు.

student unions protest
student unions protest

By

Published : Apr 29, 2021, 6:52 PM IST

పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు గులాబి పూలతో వినూత్న నిరసన చేపట్టారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పెట్టడం చాలా విడ్డూరమని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. వెంటనే పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు గులాబీ పువ్వులు ఇచ్చి.. పరీక్షలు రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details