కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు విజయ్...సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా సెల్ టవర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి...రెండు లక్షలతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... సెల్ టవర్ ఎక్కిన విజయ్ను కిందకు రావాలని కోరారు.