రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ.. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఏపీ మహిళ సమాఖ్య ఆధ్యర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. దిశ, నిర్భయ చట్టాలు ఉన్నా ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. అఘాయిత్యాలకు పాల్పడితే తూతూమంత్రంగా అరెస్టులు చేసి.. యధావిథిగా విడుదల చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మహిళలపై లైంగిక దాడులు చేసేవారిని నడిరోడ్డులో ఎన్కౌంటర్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాలని మహిళ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు.
అత్యాచారాలను అరికట్టాలని విద్యార్థుల ర్యాలీ - అత్యాచారాలను అరికట్టాలని విద్యార్థుల ర్యాలీ తాజా వార్తలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ.. మడకశిర పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్యా ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాలని మహిళ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు.
![అత్యాచారాలను అరికట్టాలని విద్యార్థుల ర్యాలీ Student rally to stop rapes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10130081-234-10130081-1609854336991.jpg)
అత్యాచారాలను అరికట్టాలని విద్యార్థుల ర్యాలీ