అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవాఘట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. పామిడి దిగువ తండా గ్రామానికి చెందిన మోహన్ నాయక్... స్థానిక గిరిజన కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటం వల్ల స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నాడు. కళాశాల సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న ఘటన అందరినీ కలిచివేసింది. మోహన్ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టాయి. అధికారులు విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
సరదా కోసం ఈతకు వెళ్లి.. విగతజీవిగా తిరిగొచ్చాడు! - gutthi
సెలవు రోజు కావటం వల్ల ఓ విద్యార్థి స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నాడు. కళాశాల సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
గుత్తి మండలం సేవాఘట్ వద్ద విషాదం.. విద్యార్థి మృతి