అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన దశరథ, కమలమ్మ దంపతులు. వీరి కూతురు గౌతమి... గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గౌతమిని పాము కాటేసింది.
గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యుల సూచన మేరకు... అనంతపురంకు తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో గౌతమి మృతి చెందింది.