అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఏడో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బాలిక వాళ్ల అమ్మకు ఉద్యోగ నిమిత్తం వేరే ఊరికి బదిలి అవగా.. స్నేహితులు దూరం అవుతారేమేనని బాలిక మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు తన దగ్గర లేని సమయాన్ని గమనించి.. మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది.
'ఐ హేట్ మై లైఫ్.. అమ్మా ఐ లవ్ యూ.. అమ్మను బాగా చూసుకో నాన్నా' అంటూ సూసైడ్ నోట్లో రాసి పెట్టి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భోజనం చేయకుండా గదిలోకి వెళ్లిన కుమార్తెను పిలిచేందుకు వెళ్లిన తల్లి... వేలాడుతున్న బిడ్డను చూసి కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.