అనంతపురం జిల్లా తాడిపత్రిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి.. నిత్యం సెల్ఫోన్లో పబ్జీ ఆట ఆడుతున్నాడని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్లూరు రోడ్డు రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటు చేసుకోగా.. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనాస్థలికి చేరుకొని బోరున విలపించారు.
పబ్జీ ఆడొద్దని తల్లి మందలింపు.. కుమారుడు ఆత్మహత్య - అనంతపురం జిల్లాలో విద్యార్ధి ఆత్మహత్య తాజా వార్తలు
పబ్జీ ఆడొద్దని తల్లి చెప్పినందుకు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పబ్జీ ఆటకు బానిసయ్యాడని తల్లి మందలించటంతో.. పుట్లూరు రోడ్డు రైల్వేగేటు వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రైలు కిందపడి విద్యార్ధి ఆత్మహత్య
ఇవీ చూడండి...