ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడికి వెళ్లాలని తల్లి చెప్పినందుకు... కొడుకు బలవన్మరణం! - ananta

కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. అయినా... అధైర్యపడకుండా తనకున్న నలుగురు పిల్లలే సర్వస్వంగా కుటుంబాన్ని వెళ్లదీస్తోంది ఆ మహిళ. పిల్లల పైనే ఆశలు పెట్టుకొని కూలీ పనులు చేస్తూ.. చదివిస్తోంది. తన కుమారుడు బడికి వెళ్లనని మెుండికేయగా.. కోపంలో మందలించింది. అంతే.. క్షణికావేశానికి గురైన ఆ చిన్నారి... ఆ తల్లికి కడుపుకోతను మిగుల్చుతూ... ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

బలవన్మరణం

By

Published : Aug 19, 2019, 11:12 PM IST

బలవన్మరణం

అనంతపురం జిల్లా గుంతకల్లు రాయల్ కూడలిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనభీ అనే మహిళకు నలుగురు సంతానం. కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోగా... కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమీపంలోని మునిసిపల్ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న ఆమె కుమారుడు దాదా ఖలందర్.. కొంత కాలంగా పాఠశాలకు వెళ్లనని మెుండికేస్తున్నాడు. విసిగిపోయిన తల్లి అతడిని ఈ మధ్య తీవ్రంగా మందలించింది. మనస్థాపం చెందిన సదరు విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికందిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి.. కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం తీరని విషాదాన్ని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details