అనంతపురం జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్రంతో పోలిస్తే సరిహద్దు రాష్ట్రాల్లో తక్కువ ధరకే మద్యం లభిస్తున్నందున.. అక్కడి నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాటుసారా తయారీ స్థావరాలపై కూడా దాడులు నిర్వహిస్తూ, బట్టీలను ధ్వంసం చేస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్న ఆయన... మద్యం, ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'అక్రమ మద్యం, ఇసుక రవాణాపై కఠిన చర్యలు' - అనంతపురం జిల్లా క్రైం
అక్రమ మద్యం, ఇసుక రవాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ముమ్మర తనిఖీలు చేస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ అన్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'అక్రమ మద్యం, ఇసుక రవాణాపై కఠిన చర్యలు'