ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనంతలో అందుకే కరోనా కేసులు తక్కువ' - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శంకరనారాయణ తెలిపారు. అందుకే జిల్లాలో తక్కువ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

minister shankar narayana
minister shankar narayana

By

Published : Apr 29, 2020, 9:28 PM IST

కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే అనంతపురం జిల్లాలో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని... బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్​లోని రెవెన్యూ భవన్​లో కోవిడ్-19 జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.

జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు పకడ్బందీగా పనిచేసేలా చూడాలని, ఆయా కేంద్రాల్లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను మంత్రి, కలెక్టర్ ఆదేశించారు. చీనీ, అరటి రైతులు నష్టపోకుండా ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రెడ్ జోన్లలోకి ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు రాకూడదని, ఎక్కడ పనిచేస్తే అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details