మడకశిరలో వర్షానికి పొంగుతున్న వాగులు, వంకలు - మడకశిరలో వర్షానికి పొంగుతున్న వాగులు, వంకలు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో సోమవారం రాత్రి నుంచి కురుసిన వర్షానికి వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో సోమవారం రాత్రి నుంచి కురుసిన వర్షానికి వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. ఉరకలెత్తుతున్న వాగులతో హరేసముద్రం చెరువుకు నీళ్లు చేరుతున్నాయి. పట్టణంలో పెద్ద వంక పారుతోంది. పంటపై ఆశలు వదులుకున్న రైతన్నల ముఖాల్లో ఈ వర్షం హర్షాన్ని నింపింది. నియోజకవర్గంలోని రొళ్ళ మండల గొల్లహట్టి గ్రామంలో వరి, రాగి, టమోటా, వేరుశనగ పంటలు నీట మునిగి పంట పూర్తి దెబ్బతింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో త్రిపుర మహిళ మృతి