ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత‌లో కోరినంత నీరు.. - హంద్రీనీవా కాలువ నీటి నిలువలు తాజా వార్తలు

ఈ సీజన్‌లో ఆశించిన వర్షాలు లేకున్నా ఎగువన కురిసిన వానల ఫలితంగా అనంతకు మేలు చేకూరింది. ఈదఫా పాడిపంటలు ఆశాజనకంగా సాగయ్యాయి. పంటల దిగుబడి సైతం మెరుగ్గా లభించింది. జిల్లా వరప్రదాయినులు హెచ్చెల్సీ, హంద్రీనీవా ద్వారా తుంగభద్ర, కృష్ణా జలాలు గలగలా పారుతూ సవ్వడి చేశాయి.

Storing plenty of waters
అనంతపురం జిల్లాలో జల కళఅనంతపురం జిల్లాలో జల కళ

By

Published : Apr 27, 2020, 8:27 AM IST

అనంతపురం జిల్లాలో జల కళ

ఎమ్పీఆర్‌లో నీటి నిల్వ

అనంతపురం జిల్లాలో జల కళ సంతరించుకుంది. ఈ సీజన్‌లో ఆశించిన వర్షాలు లేకున్నా ఎగువన కురిసిన వానల ఫలితంగా జిల్లాకు మేలు చేకూరింది. ఈదఫా పాడిపంటలు ఆశాజనకంగా సాగయ్యాయి. పంటల దిగుబడి సైతం మెరుగ్గా లభించింది. జిల్లా వరప్రదాయినులు హెచ్చెల్సీ, హంద్రీనీవా ద్వారా తుంగభద్ర, కృష్ణా జలాలు గలగలా పారుతూ సవ్వడి చేశాయి. ఈదఫా మొత్తం 60.065 టీఎంసీల నీరు జిల్లాకు చేరాయి. వృథా జలాలను కలిపి హెచ్చెల్సీకి 30.168 టీఎంసీలు, హంద్రీనీవా కాలువకు 29.897 టీఎంసీల మేర కేటాయించారు. టీబీ జలాశయం నుంచి హెచ్చెల్సీకి నిరుడు ఆగస్టు 9న, శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవాకు అదే నెల 8న నీరు విడుదల చేశారు. దాదాపు తొమ్మిది నెలలు నీటి సరఫరా సాగింది. హెచ్చెల్సీకి రెండు నెలల కిందటే సరఫరా ఆగినా.. హంద్రీనీవాకు ఇప్పటికీ రోజూ 700 క్యూసెక్కుల మేర వస్తున్నాయి. మరో మూడు రోజులు వచ్చే వీలుంది.

● ఇక ఢోకాలేదు: హెచ్చెల్సీ, హంద్రీనీవా పరిధిలోని 10 జలాశయాల్లో 11.422 టీఎంసీల జలం నిల్వ ఉంది. జూన్‌ రెండో వారం దాకా రుతుపవనాలు జిల్లాకు చేరే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. అప్పటి దాకా జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు జలాలు పుష్కలంగా నిల్వ ఉన్నాయి. అయితే ఈ జలాలు వెళ్లని ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకపోలేదు. వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

● చెరువులకూ విడుదల: ఎప్పటిలాగే ఈదఫా కూడా చెరువులను నింపే ప్రక్రియ ముమ్మరంగా సాగింది. మొత్తం 1,326 చెరువుల్లో.. 800పైచిలుకు చెరువుల్లో వాన నీరు చేరింది. హంద్రీనీవా జలాలను 113 చెరువులకు విడుదల చేశారు. హెచ్చెల్సీ కింద కూడా కొన్ని చెరువులకు నీరిచ్చారు. అయితే అత్యధిక శాతం చెరువుల కింద పంటలు సాగు చేయడంతో ప్రస్తుతం నీటి నిల్వ లేదు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడానికి దోహదం చేశాయి.

నిండుగా జీడిపల్లి జలాశయం

వేసవికి ఇబ్బంది లేదు- వెంకటరమణ, ఎస్‌ఈ, హంద్రీనీవా

ఈసారి జిల్లాకు నీరు ఎక్కువ వచ్చాయి. ఇవి వృథా కాకుండా ప్రణాళిక ప్రకారం చెరువులు, చెక్‌డ్యామ్‌లకు ఇచ్చాం. ప్రధాన కాలువనే కాదు.. మడకశిర, పుంగనూరు ఉప కాలువలకు నీరు విడుదల చేశాం. వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. దిగుబడి కూడా బాగా వచ్చింది. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేదు.

జలాశయాల్లో నీటి నిల్వ (టీఎంసీల్లో)

హెచ్చెల్సీ 8.821

* ఎమ్పీఆర్‌ 0.158

* పీఏబీఆర్‌ 1.830

* కణేకల్లు 0.089

* చిత్రావతి 6.451

* చాగల్లు 0.251

* పెండేకల్లు 0.042

హంద్రీనీవా 2.601

* జీడిపల్లి 0.620

* గొల్లపల్లి 1.391

* చెర్లోపల్లి 0.414

* మారాల 0.176

ABOUT THE AUTHOR

...view details