అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే రక్షణ దళం కార్యాలయంలో సికింద్రాబాద్ రైల్వే జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైళ్లలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయట నుంచి ఆహారం తెచ్చి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించే హిజ్రాలపైనా చర్యలు తప్పవన్నారు. త్వరలోనే రైల్వే ఆర్ఫీఎఫ్ నియామకాలు చేపట్టి అన్ని స్టేషన్లలో ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం సివిల్ పోలీసులు, ఆర్టీఎఫ్తో కలిసి కొత్త యాప్ను ప్రవేశపెడతామన్నారు.
'రైల్వే ప్రయాణికుల భద్రత కోసం చర్యలు' - safety
రైల్వే ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని సికింద్రాబాద్ రైల్వే జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు స్పష్టం చేశారు. అనంతపురంజిల్లా గుంతకల్లు రైల్వే రక్షణ దళం కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
సికింద్రాబాద్ జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు