ఓ మతిస్థిమితం లేని కొడుకుపై సవతితల్లి ప్రతాపం చూపించింది. తన సొంత కొడుకుతో కలిసి..ఆమె భర్త, కొడుకుపై దాడి చేసింది. కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి కొడుకుపై దాడి చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నారప్పకు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు మధు మానసిక దివ్యాంగుడు.
సవతితల్లి ప్రతాపం... కొడుకు , భర్తకు గాయాలు... - కొత్తపల్లిలో సవతితల్లి వార్తలు
అమ్మ చనిపోతేనేం!..సవతితల్లే అమ్మ అనుకున్నాడు ఓ మతిస్థిమితం లేని కొడుకు. కానీ ఆ తల్లి అతన్ని.. తన సొంతకొడుకు అనుకోలేదు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిసి కూడా..అతనిపై దాడి చేసింది. అడ్డువచ్చిన భర్తను సైతం కొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.
కొత్తపల్లిలో కొడుకుపై సవతితల్లి దాడి
కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి ఆమె కొడుకు కలిసి.. మొదటి భార్య కొడుకైన మధు, భర్త నారప్పను తలపై కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు