అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో రాష్ట్ర పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి పర్యటించారు. రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించారు. కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ఇక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, త్వరగా కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పారు. సేవలు వసతుల విషయంలో రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు. డాక్టర్లు ఇతర సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించవలసిందిగా ఆలూరు సాంబశివారెడ్డి కోరారు.
'నాణ్యమైన సేవలు అందిస్తాం త్వరగా కోలుకోండి' - బుక్కరాయ సముద్రంలో కోవిడ్ సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర పాఠశాల విద్య కమిషన్ సీఈఓ
బుక్కరాయసముద్రం మండలంలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను రాష్ట్ర పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పౌష్టికాహారం తిని త్వరగా కోలుకోవాలన్నారు.
ప్రస్తుతం 125 మంది తమ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారని తెలిపారు. వారికి ప్రతిరోజు వేడివేడిగా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. తాగడానికి వేడి నీళ్లు అందుబాటులో ఉంచామని, ఉల్లాసంగా ఉండటానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. ప్రస్తుతం 240 పడకలు ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి వీటిని పెంచేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. శింగనమల నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు కృషి చేస్తున్నామని ఆలూరు సాంబశివారెడ్డి వివరించారు.
ఇవీ చదవండి