ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠ భరితంగా.. రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు - latest State Level Under-17 Hockey Competitions news in telugu

అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. నువ్వా-నేనా అన్నట్టుగా క్రీడాకారులు తలపడ్డారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది.

State Level Under-17 Hockey Tournament Finals in ananthapuram district

By

Published : Oct 31, 2019, 11:33 PM IST

ఉత్కంఠ భరితంగా సాగిన హాకీ ఫైనల్ మ్యాచ్

రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుంచి జరుగుతున్న పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్ పోటీల్లో బాలుర విభాగంలో అనంతపురం... వైజాగ్ జట్లు హోరా హోరిగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. బాలికల విభాగం ఫైనల్ పోటీల్లో కడప... అనంతపురం జిల్లా జట్లు తలపడగా.. కడప జిల్లా జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ ట్రోఫీలు ప్రదానం చేశారు. వచ్చే నెల 17న ఛత్తీస్​ఘడ్​లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు 18మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details