అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీసు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాచ్ ఫెర్రర్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. జాతీయ పతాకంతో పాటు.. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు.
ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు ప్రారంభం
అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ సెపక్ తక్రా(కిక్ వాలీబాల్) పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాచ్ ఫెర్రర్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఉరవకొండలో జరగడం సంతోషకరమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. క్రీడాకారులు జయాపజయాలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని వారు సూచించారు. క్రీడల ద్వారా శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాకారులు తమలోని నైపుణ్యాన్ని వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఇదే క్రీడా మైదానంలో జాతీయ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. పోటీలకు 13 జిల్లాల నుంచి దాదాపు 52 జట్లతో పాటు 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 'అమ్మ తొలిదైవం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలకు మంగళం..!