అనంతపురంలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్‌ను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ ప్రారంభించారు. దివ్యాంగులైన యువతీ యువకులకు నగరంలోని సంజీవరెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న క్రీడలను.. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సామాన్యుల కంటే దివ్యాంగులకే ఉన్నతమైన భవిష్యత్తు ఉందని.. క్రీడల్లో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలని అనురాధ అన్నారు. రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్ అనంతపురంలో జరగడం అభినందనీయమని.. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్ ప్రారంభం - state level para sports meet latest news
సామాన్యుల కంటే దివ్యాంగులకే ఉన్నతమైన భవిష్యత్తు ఉందని.. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ అన్నారు. అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్‌ను ఆమె ప్రారంభించారు.
అనంతలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
TAGGED:
state level para sports meet