లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5000 చొప్పున అందించాలని మాజీ మంత్రి, తెదేపా నేత పల్లె రఘనాథ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో నోటికి నల్లటి వస్త్రం ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిరాశ్రయుల కోసం ప్రతి మండలంలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. లాక్డౌన్తో రోజువారి కూలీలు, చేతి వృత్తులపై ఆధారపడిన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పల్లె రఘనాథ రెడ్డి అన్నారు. అలాగే వెంటనే అన్న క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయాల పైన దృష్టి పెట్టారని విమర్శించారు.
'ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి' - corona cases in ap
లాక్డౌన్తో ఎంతోమంది పేదలు కష్టాలు పడుతున్నారని తెదేపా నేత పల్లె రఘనాథ రెడ్డి అన్నారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
palle raghunatha reddy