విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ , ప్రజా సంఘాలు ఈనెల 5వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
'ఈ నెల 5న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి' - aisf latest news
విశాఖ ఉక్కు - పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ మార్చి 5న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వామపక్ష పార్టీలు, ఏఐఎస్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం నుంచి సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం.. ఆంధ్రులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేన్నారు
'ఈ నెల 5న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి'
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భాజపా మినహా అధికార ప్రతి పక్షాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన కొనసాగిస్తున్నాయని నేతలు అన్నారు. ప్రధాని మోదీ నాలుగు రంగాలు మినహా అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తామని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం నుంచి సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం... ఆంధ్రులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేన్నారు.
ఇదీ చదవండి