ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SSBN College students: 'కళాశాలను ప్రైవేటీకరించేందుకు లోలోపల కుట్ర'

SSBN College students: అనంతపురంలో ఎస్​ఎస్​బీఎన్​ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్​ఎఫ్​, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కళాశాలను ఎయిడెడ్​​గా కొనసాగిస్తామని చెబుతున్నా యాజమాన్యం.. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

ssbn-college-students
ssbn-college-students

By

Published : Dec 21, 2021, 3:15 PM IST

SSBN College students: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనంతపురంలో ఎస్​ఎస్​బీఎన్​ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్​ఎఫ్​, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

కళాశాలను ఎయిడెడ్​ గా కొనసాగిస్తామని చెబుతున్నా యాజమాన్యం.. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి లోలోపల కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 రోజులుగా విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కళాశాలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని హెచ్చరించారు. ఫీజులు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:SSBN College: ఎయిడెడ్‌ సంస్థగానే ఉంటాం: ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల

ABOUT THE AUTHOR

...view details