ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SSBN College: ఎయిడెడ్‌ సంస్థగానే ఉంటాం: ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల - విద్యార్థులపై లాఠీ చార్జ్

ఎయిడెడ్‌ (Aided) సంస్థగానే కొనసాగుతామని అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల (SSBN College) యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో వెనక్కి తగ్గిన కళాశాల యాజమాన్యం..ఎయిడెడ్‌ సంస్థగానే ఉంచాలని కళాశాల కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

ఎయిడెడ్‌ సంస్థగానే ఉంటాం
ఎయిడెడ్‌ సంస్థగానే ఉంటాం

By

Published : Nov 12, 2021, 4:32 PM IST

అనంతపురంలోని ఎస్ఎస్​బీఎన్ కళాశాలను (SSBN College) ఎయిడెడ్ (Aided) కళాశాలగా కొనసాగించాలని ఆ కళాశాల మేనేజ్​మెంట్ కమిటీ (Management Committee) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వ ఎస్ఎస్​బీఎన్ కళాశాలను ప్రైవేట్ యాజమాన్యం కిందకు మార్చటాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన (Protest) చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈనెల 10న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జి (Police Lathi Charge) చేయటం రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. లాఠీఛార్జ్ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళాశాలను ఎయిడెడ్ సంస్థగానే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కళాశాలను ప్రైవేట్​గా మార్చితే ఉద్యమం తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. ఏఐఎస్​ఎఫ్ (AISF), టీఎన్​ఎస్​ఎఫ్(TNSF) విద్యార్థి సంఘం నేతలు కళాశాల యాజమాన్యానికి, కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు.

ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకుంది. ట్రస్టు విద్యా సంస్థగానే ఎయిడెడ్ కింద కొనసాగించాలని కాలేజీ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు (Collector) తీర్మాన కాపీ ఇచ్చినట్లు కళాశాల కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదీ చదవండి

PROTEST: ఎయిడెడ్ కళాశాలలు కొనసాగించాలి: విద్యార్థి సంఘాలు

ABOUT THE AUTHOR

...view details