ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేతనాలు పెంచాలి... బకాయిలు చెల్లించాలి... రాజకీయ జోక్యం తగ్గాలి' - కల్యాణదుర్గంలో శ్రీరాంరెడ్డి వాటర్ పథకం ఉద్యోగుల ధర్నా

వేతనాలు పెంచాలని, తమపై పెరుగుతున్న రాజకీయ జోక్యం ఆపాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంరెడ్డి నీటి పథకం ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆందోళన చేశారు.

sriram reddy water scheme employees protest in kalyana durgam ananthapuram district
శ్రీరాం రెడ్డి వాటర్ పథకం ఉద్యోగుల ఆందోళన

By

Published : Jul 15, 2020, 3:44 PM IST

Updated : Jul 15, 2020, 5:00 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో శ్రీరాంరెడ్డి నీటి పథకం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల నిలుపుదలతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. 3 నెలల జీతంతోపాటు 52 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరారు.

వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న తమపై రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు పెంచేలా జోక్యం చేసుకోవాలని విన్నవించారు. అధికార పార్టీ నేతల వేధింపులు ఆపాలను కోరారు.

Last Updated : Jul 15, 2020, 5:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details