ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీరామ్ రెడ్డి సాగర్​ నీటి ప్రాజెక్టు పైపులైన్​ లీక్ - శ్రీ రామ్ రెడ్డి పైపు లైన్ లీక్ న్యూస్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ రామ్ రెడ్డి నీటి ప్రాజెక్టు ప్రధాన పైపులైన్ పగిలింది. పైపులైన్ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసి పడిన కారణంగా.. చుట్టుపక్కల పంట పొలాలు కోతకు గురయ్యాయి. తరచూ ఈ సమస్య ఎదురవుతోందని రైతులు వాపోయారు.

శ్రీ రామ్ రెడ్డి పైపునకు గండి.. కోతకు గురైన పొలాలు
శ్రీ రామ్ రెడ్డి పైపునకు గండి.. కోతకు గురైన పొలాలు

By

Published : May 27, 2020, 12:17 PM IST

అనంతపురం జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీ రామ్ రెడ్డి నీటి పథకం పైపులైన్.. కళ్యాణదుర్గం పరిసరాల్లో ఉంది. ఈ పైపు లైన్ తరచూ లీకై.. గంటల పాటు నీరు వృథా అవుతోంది. నీటి వృథాతో పాటు.. పైపు నుంచి వస్తున్న నీటి ఉద్ధృతికి చుట్టుపక్కల పంటపొలాలు కోతకు గురవుతున్నాయి.

తాజాగా ఈ పైపులైన్​కు గండిపడింది. గండి వల్ల మల్లాపురం గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున టమాటా పంట పూర్తిగా కోతకు గురైంది. లక్ష రూపాయలకుపైగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. అధికారులు స్పందించి పైపులైన్​ పాడవకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details