ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైలాంజనేయస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

అనంతపురం జిల్లా బైలాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అనంతరం ఆలయ ఆవరణలో వైభవంగా ఉట్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Sri Ramanavami celebrations
శ్రీరామనవమి వేడుకలు

By

Published : Apr 22, 2021, 11:41 AM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలోని బైలాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ఆలయ ఆవరణలో వైభవంగా ఉట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కన్నుల పండువగా..

సోమందేపల్లి మండలంలోని ఈదుల బలపురంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలను రంగు రంగుల పువ్వులతో అలంకరించి.. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ వాహనాలతో ప్రదర్శనలు నిర్వహించారు.

ఇదీ చదవండీ..ఓపెన్‌ రీచ్‌లలో తవ్వకాల నిలిపివేత.. ఇసుక దొరక్క కష్టాలు

ABOUT THE AUTHOR

...view details