అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాల సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడికి అర్చకులు ప్రత్యేక శ్రద్ధలతో పూజలు చేశారు. స్వామివారిని సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం రంగ మండపంలోని పీఠంపై శ్రీవారికి పుష్పార్చన, తులసి అర్చనలు ఆగమోక్తముగా చేపట్టారు.
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాల సేవ - laxminarasimha swamy temple latest news
కదిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి వార్లకు అర్చకులు ఊంజల్ సేవ చేశారు. అలంకార భూషితుడైన స్వామివారికి సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలకరించి ప్రత్యేక పూజలు చేశారు.
ఉంజల్ సేవలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు