అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రథంపై లక్ష్మీ చెన్నకేశవ స్వామి ని అధిష్టింపజేశారు.
ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆలయం చుట్టు రథాన్ని ఊరేగించారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల మధ్య జరిగే రథోత్సవం, లాక్డౌన్ కారణంగా ఆలయ ఆవరణలోనే నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు వెలుపలినుంచే మొక్కులు చెల్లించుకున్నారు.