Sri Krishnadevaraya University law courses: రాయలసీమ యువతకు మూడేళ్ల న్యాయవిద్యను అందించే ఏకైక వర్సిటీ.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్కేయూలో న్యాయవిద్య కోర్సును నిలిపివేసేందుకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరంలో..... మూడేళ్ల లా కోర్సు వెబ్ కౌన్సిలింగ్ నుంచి ఎస్కేయూ పేరు తొలగించాలని.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కు వర్సిటీ యంత్రాంగం లేఖ రాసింది. ఎంతోమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అందించిన ఎస్కేయూ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశాలను నిలిపేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కేవలం ఎస్కేయూ, ఆంధ్ర విశ్వద్యాలయం, తిరుపతి పద్మావతి వర్సిటీల్లోనే మూడేళ్ల న్యాయవిద్య కోర్సులు ఉన్నాయి. పద్మావతి మహిళా వర్సిటీలో కేవలం మహిళలకు మాత్రమే కోర్సులు నిర్వహిస్తున్నారు. 1976లో తిరుపతి నుంచి పీజీ సెంటర్ అనంతపురానికి బదిలీ అయినప్పటీ నుంచి ఇక్కడ న్యాయవిద్య కొనసాగుతోంది. ఏటా 88 సీట్లతో మూడేళ్ల న్యాయవిద్య కోర్సు నిర్వహిస్తున్న ఎస్కేయూ... ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి, రిజిస్టార్‌లు నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ అధికారుల తీరుతో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు