అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి గంగ పూజ, విశేష అలంకరణ, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయదుర్గంలోని తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పంచమ జ్యోతులు ఉత్సవం నిర్వహించారు.
వైభవంగా శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల మహోత్సవం - mla kapu ramchandrareddy updates
అనంతపురం జిల్లాలో శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం
రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి,తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకొని పంచమ జ్యోతుల ఉత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి జ్యోతులను తలమీద పెట్టుకొని ఎమ్మెల్యే స్వయంగా ఊరేగింపులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి
'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు.. ప్రజలు సహకరించాలి'
TAGGED:
rayadurgam latest news