అనంతపురం జిల్లాలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో... జిల్లావ్యాప్తంగా 750 మంది కార్మికులు 950 గ్రామాల్లో పనిచేస్తున్నారు. వారి సమస్యలపై 5 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారులు గుత్తేదారులు స్పందించడం లేదని వాపోతున్నారు. 4 నెలలుగా జీతాలు అందడం లేదని, చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నామని చెబుతున్నారు. బకాయి ఉన్న పీఎఫ్ ఇచ్చి... ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు
కార్మికుల రిలే దీక్షలు... సీఐటీయూ మద్దతు - శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు తాజా వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం వద్ద... కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. వారి దీక్ష ఐదో రోజుకు చేరింది. సీఐటీయూ రాష్ట్ర సభ్యులు ఓబులు దీక్షకు మద్దతు ప్రకటించారు.
శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల రిలే దీక్షకు సీఐటీయూ మద్ధతు