ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఆటల పోటీలు - sports compitations latest news updates
ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాయలసీమ రాకర్స్ రీజనల్ లెవెల్ క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ మైదానం, ఆర్ట్స్ కళాశాల మైదానం, ఇండోర్ స్టేడియంలో అథెల్టిక్స్తోపాటు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూలు, చిత్తూరు నుంచి వచ్చిన... మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి, విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేయనున్నారు.