అనంతపురంలోని ఆర్డీటీ సంస్థలో క్రీడా విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్న శంకర్ తన పెద్ద కూమార్తె రుత్వికశ్రీకి పర్వతారోహణలో ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ బాలిక ఈ ఏడాది ఫిబ్రవరిలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ స్ఫూర్తితో ముందుకు వచ్చిన.. రుత్విక సోదరి భవ్యశ్రీతోపాటు.. మరో ముగ్గురు చిన్నారులకు శంకర్ శిక్షణ అందించారు. వీళ్లంతా ప్రస్తుతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. శిక్షణలో భాగంగా ఈ నెల 15న లద్దాఖ్ లోని ఖర్దుంగ్ లా పర్వతాన్ని అధిరోహించారు.
ఐదే రోజుల్లో..
ఖర్దుంగ్ లా పర్వతాన్ని అధిరోహించి.. చిన్నారులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రెండు రోజులు లద్దాఖ్‌లో శిక్షణ పొంది.. ఐదు రోజుల వ్యవధిలో.. రోజూ తొమ్మిది గంటల పాటు నడుస్తూ.. పర్వతం ఎక్కేశారు. ఎవరెస్టు శిఖరం ఎక్కి.. దేశ గౌరవాన్ని పెంచటమే కాకుండా.. తమను ఆదరిస్తున్న ఆర్డీటీ ఖ్యాతిని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిన్నారులు చెబుతున్నారు.