ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అనంత' లాభాల్లో నేరేడు రైతులు

By

Published : Jun 3, 2021, 10:02 PM IST

రోగనిరోధక శక్తి పెరుగుదల, విటమిన్ల కోసం రకరకాల పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న కొవిడ్ బాధితులు... అల్లనేరేడు ఎక్కువగా తినాలని చెబుతుండటంతో వాటి డిమాండ్ అమాంతం పెరిగింది. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది దిగుబడి ఎక్కువ ఉండటం, ధర బాగుండటం రైతులను ఆనందంలో ముంచుతోంది.

apricots
లాభాల్లో నేరేడు రైతులు

'అనంత' లాభాల్లో నేరేడు రైతులు

ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లాలో ఈసారి దానిమ్మ, బత్తాయి, అల్లనేరేడు వంటి పండ్లకు డిమాండ్‌ ఎక్కువైంది. ప్రస్తుతం అల్లనేరేడు దిగుబడులు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఈ పండును ఎక్కువగా సూచిస్తుండటంతో... ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారులే నేరుగా తోటలకు వెళ్లి కిలోకు రూ.350 నుంచి 400 రైతుకు చెల్లిస్తున్నారు. కొన్నేళ్లల్లో ఎన్నడూ లేని దిగుబడి వచ్చినా... ఆంక్షల వల్ల వ్యాపారం కొంచెం తగ్గిందని లేకుంటే మరింత బాగుండేదని రైతులు అంటున్నారు.

జిల్లావ్యాప్తంగా 692 ఎకరాల్లో అల్లనేరేడు సాగు జరుగుతోంది. గతేడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో ఉద్యాన తోటలు ప్రాణం పోసుకున్నాయి. అల్లనేరేడు క్రయవిక్రయాలు, రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇస్తున్నట్టు ఉద్యాన అధికారులు చెబుతున్నారు. కొందరు ప్రజలు నేరుగా తోటలకే వెళ్లి అల్లనేరేడు కొనుగోలు చేస్తున్నారు. విపరీత డిమాండ్‌తో జిల్లా నుంచి పొరుగురాష్ట్రాలకూ పండ్లు ఎగుమతువుతున్నాయి.

ఇదీ చదవండి

Anandaiah Medicine: 3 నెల‌ల త‌ర్వాతే.. ఆనంద‌య్య చుక్క‌ల‌ మందు..!

ABOUT THE AUTHOR

...view details