అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో లోక క్షేమం, శాంతి కోరుతూ మాన్య సూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని పరోక్ష సేవల్లో భాగంగా మాన్య సూక్త హోమం నిర్వహించామని ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. ప్రజలందరు కరోనా నుంచి బయటపడి ఆరోగ్యం ఉండాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, మహా మంగళ హారతి, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
లోక క్షేమం, శాంతి కోరుతూ... కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో సూక్త హోమం - కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో సూక్త హోమం
లోక క్షేమం, శాంతి కోరుతూ అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో మాన్య సూక్త హోమం నిర్వహించారు.

లోక క్షేమం, లోక శాంతి కోరుతూ... కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో సూక్త హోమం
TAGGED:
కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం