పట్టాభిరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - anantapur news
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పురాతన కోట పట్టాభిరామ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు భాజపా నాయకులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
![పట్టాభిరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు special programmes pattabirama swamy temple kalyanadurgam ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8303387-138-8303387-1596626674112.jpg)
పట్టాభిరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టాభిరామ స్వామి ఆలయం ఉదయం నుంచి శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన నేపథ్యంలో ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామునే పురోహితులు ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకంతో పాటు హోమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.