కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతగా కదలాల్సిన తరుణమిది. కొందరు ప్రజల్లో చైతన్యం తెస్తుండగా.. మరికొందరు ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. ఈ క్రమంలో.. లాక్‌డౌన్ ఉల్లంఘించి మెరుపు వేగంతో వెళ్లి... కరోనా బారిన పడొద్దని ఓ యువకుడు శిరస్త్రాణం ధరించి అనంతపురం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. విధి నిర్వహణకు బయలుదేరేది మొదలు.. తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రత్యేక దుస్తులు ధరిస్తూ.. మహమ్మారిని దరి దాపులకు కూడా రానీయకుండా.. ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కరోనాపై అందరికీ అవగాహన కలిగించేలా..! - ఏపీలో కరోనా మరణాలు
అనంతపురం జిల్లా యువకులు కొందరు.. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగించేలా ఇలా విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. చూపరులను ఆకట్టుకుంటున్నారు.
కరోనాపై అవగాహనకై యువకుల ప్రత్యేక అలంకరణ