'వలస కూలీలు సంప్రదిస్తే సౌకర్యాలు కల్పిస్తాం' - ప్రత్యేక ఐజీా సంజయ్ కరోనా వైరస్
అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్ అమలును ప్రత్యేక ఐజీ సంజయ్ పరిశీలించారు. వలస కూలీలు సంప్రదిస్తే సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని ఉద్ఘాటించారు
వలస కూలీలు మమ్మల్ని సంప్రదిస్తే సౌకర్యాలు కల్పిస్తాం:ప్రత్యేక ఐజీ సంజయ్
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యేక ఐజీ సంజయ్ తెలిపారు. వసతి లేనివారు..తమను ఏదో ఒక మాధ్యమం ద్వారా తమను సంప్రదించవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి, ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్ అమలును ఆయన పరిశీలించారు