ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు.. 21 మంది అరెస్ట్ - అనంతపురం ఎస్ఈబీ

అనంతపురం జిల్లాలోని నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. సారా విక్రయిస్తున్న 21 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 185 లీటర్ల నాటు సారా, 20 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురంలో నాటు సారా
Special enforcement bureau officers

By

Published : Dec 21, 2020, 12:53 PM IST

అక్రమ మద్యం నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యురో(ఎస్ఈబీ) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో దాడులు జరిగాయి. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు ఎస్ఈబీ అధికారి రామమోహనరావు సారథ్యంలో పోలీసు బృందాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి.

వివిధ ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలుపై సిబ్బంది దాడులు చేశారు. సారా విక్రయాలు చేస్తున్న 21 మందిని అరెస్టు చేశారు. 1434 టెట్రా ప్యాకెట్లు, 8 మద్యం సీసాలు సీజ్ చేశారు. 4,630 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details