OMC CASE UPDATES : ఓబుళాపురం గనుల కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలను వెంటనే తమకు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఒరిజినల్ పత్రాలు, జప్తు చేసిన వస్తువులు లేనందున కేసు విచారణ వాయిదా వేయాల్సి వస్తోందని సీబీఐకి లేఖ రాసింది. జప్తు చేసినవి కేసుతో సంబంధమా లేదా అనే విషయాన్ని తీర్పు సమయంలో నిర్ణయించవచ్చునని కోర్టు పేర్కొంది.
ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలు సమర్పించాలి.. సీబీఐకి ఆదేశం - ఓబుళాపురం గనుల కేసు
OMC CASE : ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలను వెంటనే తమకు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఒరిజినల్ పత్రాలు, జప్తు చేసిన వస్తువులు లేనందున కేసు విచారణ వాయిదా వేయాల్సి వస్తోందని సీబీఐకి లేఖ రాసింది.
OMC CASE UPDATES
దిల్లీలోని కేంద్ర కార్యాలయంతో పాటు హైదరాబాద్, బెంగళూరు నుంచి సేకరించి ఇవ్వాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో OMC కేసు రోజువారీ విచారణ జరుగుతోంది. సాక్షుల విచారణ, పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 21 మంది సాక్షుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కేసుకు సంబంధించిన 89 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇవీ చదవండి: