ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో కొవిడ్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు - గుంతకల్లు నేట్ వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు.. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Special actions Taken For decrease corona cases in gunthakal ananthapuram district
గుంతకల్లులో కొవిడ్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు

By

Published : Jul 8, 2020, 10:37 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని కిరాణా, వస్త్ర దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్​లో నిబంధనలు పాటించని యాజమాన్యాలకు జరిమానా విధిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, పురపాలక శాఖ సంయుక్త అధ్వర్యంలో ఉదయం, సాయంకాల సమయాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయటకు వస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాన్ని గ్రీన్ జోన్​గా మార్చడానికి అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details