అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రథోత్సవ ఏర్పాట్లను ఎస్పీ ఏసుబాబు పరిశీలించారు. రథోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. రథోత్సవం రోజు వాహనాల మళ్లింపు, పార్కింగ్‌లకు ఏర్పాట్లు చేసి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ - శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
అనంతపురం కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవ ఏర్పాట్లను ఎస్పీ ఏసుబాబు పరిశీలించారు. రథోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ