మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. జిల్లాలో 11 చోట్ల ప్రత్యేక పోలీసు బందోబస్తును నియమించామన్నారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మంది దాకా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు.
గుంతకల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - గుంతకల్లులో ఎస్పీ ఏసుబాబు పర్యటన వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లులో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. 10వ తేదీన ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
గుంతకల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 30 వేల మద్యం బాటిళ్లను సీజ్ చేయటంతో పాటు.. 17 లక్షల నగదును పట్టుకున్నామని అన్నారు.
ఇదీ చదవండి