అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షల అమలు తీరుని ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద వాహనాల తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. ఆంక్షల సమయంలో ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. రహదారులపై వెళ్తున్న వాహన చోదకులు, ఆటోలను ఆపి.. బయటకు రావటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేయించి.. వాహనాలను సీజ్ చేయించారు.
కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ సత్యఏసు - sp satya yesu babu latest news
అనంతపురంలో కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ సత్యఏసు బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహన తనిఖీల్లో పాల్గొని అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయించారు.
వాహన తనిఖీలు చేస్తున్న ఎస్పీ