బాలల బంగారు భవితకు సమష్టిగా కృషి చేద్దామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో రెస్క్యూ చేసిన బాలలు, వారి తల్లిదండ్రులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తోడ్పడాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా బాల కార్మికులు ఉండకూడదన్నారు. ఎవరైనా వారిలో పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లల భవితకు దోహదపడాలని సూచించారు రెస్క్యు బాలలకు దుస్తులు, సురక్షిత ఉపకరణలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి - అనంతపురంలో రెస్క్యూ బాలలు వార్తలు
అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో రెస్క్యూ చేసిన బాలలు, వారి తల్లిదండ్రులతో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లల కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని వారి భవితకు దోహదపడాలని సూచించారు.
అనంతపురంలో రెస్క్యూ బాలలు