ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SP Dance Viral Video : "బుల్లెట్టు బండి" పాటకు.. జబర్దస్త్ డ్యాన్స్ చేసిన పోలీస్ బాస్..!

SP Dance Viral Video : అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప సందడి చేశారు. కంబదూరు సమీపంలోని అండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వనభోజనాలకు అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ బండి పాటకు చేసిన నృత్యం.. అందరినీ ఆకర్షించింది.

ఆటపాటలతో సందడి చేసిన ఎస్పీ
ఆటపాటలతో సందడి చేసిన ఎస్పీ

By

Published : Dec 2, 2021, 5:44 PM IST

ఆటపాటలతో సందడి చేసిన ఎస్పీ

SP Dance Viral Video : అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. ఆటపాటలతో సందడి చేశారు. జిల్లాలోని కంబదూరు సమీపంలోని అండేపల్లి గ్రామంలోని రామప్పకొండపై.. పోలీసు అధికారులు వన భోజనాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని పోలీసు కుటుంబాలు ఈ వనభోజనాల్లో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఫక్కీరప్ప.. ఆడిపాడారు. ఇటీవల ప్రాచుర్యలోకి వచ్చిన "బుల్లెట్ బండి" పాటకు నృత్యం చేసి అందర్నీ ఉత్తేజపరిచారు. వనభోజనాల సందర్భంగా ఎస్పీ చేసిన డ్యాన్సుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

ఇదీ చదవండి:

జయహో అఖండ... పూనకాలతో ఊగిపోతున్న థియేటర్లు!

ABOUT THE AUTHOR

...view details